ఉక్రెయిన్‌పై డ్రోన్లతో రష్యా  విరుచుకుపడింది

రాత్రి వేళ మొత్తం 17 ప్రాంతాల్లో ఈ దాడులు జరిగినట్టు ఉక్రెయిన్‌ వైమానిక దళం ప్రకటించింది

ఈ సారి రష్యా రికార్డు స్థాయిలో డ్రోన్లను ప్రయోగించిందని ఉక్రెయిన్‌ పేర్కొంది

దాడుల కారణంగా భవనాలు, జాతీయ పవర్‌గ్రిడ్‌తో సహా కీలక మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి

ఐతే, ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని అధికారులు వెల్లడించారు

మరోవైపు.. సరిహద్దు ప్రాంతంలో ఉక్రెయిన్‌ ఉంచిన 39 డ్రోన్లను ధ్వంసం చేసినట్లు రష్యా తెలిపింది

కాగా.. ఇటీవల వందలకొద్దీ గ్లైడ్‌ బాంబులను రష్యా తమ దేశంపై ప్రయోగించిందని జెలెన్‌స్కీ వెల్లడించిన సంగతి తెలిసిందే

ఉక్రెయిన్‌పై ఆక్రమణకు పాల్పడిన రోజే అణ్వాయుధాలను యుద్ధంలో వాడేందుకు రష్యా సిద్ధంగా ఉన్నట్లు

రష్యా నుంచి పారిపోయిన ఓ సైనికుడు అణుస్థావరాల్లో పరిస్థితులను వివరించాడు

ఈ నేపథ్యంలోనే పుతిన్‌ అణ్వాయుధాలను వాడే అవకాశం ఉందన్న ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి