ఉగాది వేళ.. యువతకు గుడ్ న్యూస్
శ్రీపరాభవ నామ సంవత్సరం ఉగాది పర్వదినం వేళ.. నిరుద్యోగులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
నిరుద్యోగుల కోసం రానున్న 7 నెలల్లో 10,060 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు జాబ్ క్యాలెండర్‌ను ప్రభుత్వం గురువారం ప్రకటించింది.
మే నెలలో ఉన్నత విద్యా శాఖలో 1,500 ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించింది.
ఆగస్టులో హోం శాఖలో 2,778తోపాటు ఇతర శాఖల్లో 928 ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు తెలిపింది.
సెప్టెంబర్‌లో గ్రూప్-2 పరీక్ష ద్వారా 750 పోస్టులు భర్తీ చేస్తామని పేర్కొంది.
ఇంజనీరింగ్ విభాగంలో 503తోపాటు ఇతర శాఖల్లో 506 ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు వివరించింది.
అక్టోబర్‌లో పాఠశాల, ఇంటర్మీడియట్ బోర్డులలో కలిపి 3,004 ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
2023, జనవరి 27న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పేరిట పాదయాత్ర చేపట్టారు.
తాము అధికారంలోకి వస్తే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని ఈ సందర్భంగా యువతకు ఆయన హామీ ఇచ్చారు.
దాంతో ఉగాది పండగ వేళ.. జాబ్ క్యాలెండర్‌ను కూటమి ప్రభుత్వం ప్రకటించింది.
Related Web Stories
ప్రపంచంలోనే అతి పెద్ద మిలిటరీ శక్తి కలిగిన దేశాలు ఇవే..!
లొంగిపోయిన మావోయిస్టు అగ్ర నేతలు
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు.. విశేషాలు