ఆషాడంలో గోరింటాకు
ఎందుకు పెట్టుకుంటారో తెలుసా..
ఆషాఢ మాసంలో వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి. వాతావరణం చల్లబడిపోతుంది. ఆ సమయంలో మన శరీరంలోని వేడి.. బయట వాతావరణానికి విరుద్దంగా తయారవుతుంది.
దీంతో అనారోగ్య సమస్యలు వస్తాయి. అయితే గోరింటాకుకు శరీరంలో వేడిని తగ్గించే శక్తి ఉంటుంది.
అంతేకాకుండా గోరింటాకు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.
కొన్ని సంప్రదాయాల ప్రకారం గోరింటాకు గర్భాశయ దోషాలను తొలగిస్తుందని స్త్రీ అరోగ్యాన్ని కాపాడుతుందని నమ్ముతారు.
ఆయుర్వేదంలో గోరింటాకు వేర్లు, బెరడు, ఆకులు, ఫూలు, విత్తనాలు అన్ని ఔషద గునాలు కలిగి ఉన్నాయని చెబుతారు.
కొత్త పెళ్లి కూతుళ్లు తమ పుట్టింటికి చేరుకోవడం అనవాయితీ. ఆ సమయంలో తమ చేతులకు పండించుకునే గోరింట, వారికి తమ సౌభాగ్యాన్ని గుర్తుచేస్తుంది.
పుట్టింట ఉన్నా మనస్సు, మెట్టినింట ఉన్న భర్త
ఆరోగ్యాన్ని కాంక్షిస్తుంది.
అందుకే ఆషాడంలో గోరింటాకు పెట్టుకోవాలని పెద్దలతో పాటు డాక్లర్లు కూడా చెప్తుంటారు.
Related Web Stories
సన్ స్క్రీన్ ఎలా వాడాలో తెలుసా..
వయసు పెరిగినా తరగని అందం.. వీటితో సొంతం..
మీ కిడ్నీలను కాపాడే.. 8 సూపర్ ఫుడ్స్ ఇవే..
పాము కాటేస్తే.. ఇలా చేయండి..