సన్ స్క్రీన్  ఎలా వాడాలో తెలుసా..

సన్‌స్క్రీన్‌ను మేకప్‌లో భాగంగా పరిగణించకూడదు. అది చర్మ సంరక్షణలో భాగం. 

అందుకే మేకప్‌కు ముందు ముఖంపై అప్లై చేస్తారు.

ముఖం కడిగిన తర్వాత మాయిశ్చరైజర్ అప్లై చేసి, ఆపై సన్‌స్క్రీన్ రాయాలి. 

 ముఖానికి మాత్రమే సన్‌స్క్రీన్ రాసుకోకుండా.. గొంతు, మెడ, చెవులకు కూడా సన్‌స్క్రీన్ రాసుకోవాలి.

ప్రతి 2 గంటలకోసారి సన్‌స్క్రీన్ అప్లై చేయడం మంచిది. ముఖ్యంగా ఎక్కువసేపు ఎండలో ఉంటే ఇది పాటించాలి.

సన్‌స్క్రీన్ ఎంపికలో చర్మ రకాన్ని పరిగణనలోకి తీసుకోవడం చాలా ముఖ్యం.