వయసు పెరిగినా తరగని అందం..  వీటితో సొంతం..

నేటి బిజీ జీవితంలో చాలా మంది తమ కోసం సమయం కేటాయించలేకపోతున్నారు...

దీని వల్ల ఒత్తిడి, ఆరోగ్య సమస్యలు, చర్మ సమస్యలు వంటివి ఎన్నో ఎదురవుతున్నాయి.

శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజూ వ్యాయామానికి కొంత సమయం కేటాయించాలి.

వ్యాయామాలు చేయడం వల్ల శరీరం యాక్టివ్‌గా ఉంటుంది. కండరాలు బలంగా ఉండి, చర్మం ముడతలు లేకుండా మెరిసిపోతుంది.

ఆహారం మన ఆరోగ్యంలో కీలకపాత్ర పోషిస్తుంది. కూరగాయలు, తాజా పండ్లు, గింజలు, ఒమేగా-3 కొవ్వులు ఉండే ఆహారం తీసుకుంటే చర్మానికి పోషణ కలుగుతుంది.

నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల చర్మం హైడ్రేడెట్‌గా ఉంటుంది.

రోజుకు కనీసం 7–8 గంటలు నిద్ర అవసరం. గాఢ నిద్ర వల్ల శరీరం రిపేర్ అవుతుంది. చర్మానికి విశ్రాంతి లభిస్తుంది

ఇంటి నుంచి బయటకు వెళ్తే తప్పనిసరిగా సన్‌స్క్రీన్ రాసుకోండి. వారానికి ఒక్కసారి ఫేస్ ప్యాక్, స్క్రబ్ వంటివి ఉపయోగించండి.