ముఖం మీద ఐస్ గడ్డలు పెట్టడం వల్ల కొన్ని నష్టాలు ఉన్నాయి. అవేంటంటే.. 

ఐస్ గడ్డలను చర్మంపై ఉంచడం వల్ల చికాకు, మంటకు కారణమవుతుంది. 

ముఖంపై ఐస్ రుద్దడం వల్ల బ్యాక్టీరియా పెరిగిపోయి దుద్దుర్లు, ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉంటుంది. 

తరచూ చర్మంపై ఐస్ రద్దడం వల్ల చర్మం పొడిబారిపోతుంది.

ముఖంపై ఐస్ గడ్డ పెట్టడం వల్ల చర్మం సున్నితంగా మారడంతో పాటూ తామర, రోసేసియా వంటి సమస్యలు తలెత్తుతాయి.

చర్మంపై ఎక్కువసేపు ఐస్ గడ్డలను పెట్టడం వల్ల రక్తనాళాలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉంటుంది.

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.