ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ముత్యాల ముగ్గుల పోటీలు రెండు తెలుగు రాష్ట్రాల్లో అంగరంగ వైభవంగా సాగుతున్నాయి.
వయస్సుతో నిమిత్తం లేకుండా మహిళలు భారీగా ఈ ముగ్గుల పోటీలకు తరలివస్తున్నారు.
రంగురంగుల రంగవల్లులతో ముగ్గులు వేస్తూ సత్తా చాటుతున్నారు.
ప్రతి ఏటా ఆంధ్రజ్యోతి ఈ ముగ్గుల పోటీలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ పోటీల్లో పాల్గొనేందుకు, బహుమతులు గెలుచుకునేందుకు మహిళలు పెద్దఎత్తున పోటీ పడుతున్నారు.
పల్లె, పట్టణాలు, నగరాలు అని తేడా లేకుండా పెద్దఎత్తున యువత పోటీలకు తరలివస్తున్నారు.
రంగురంగుల రంగవల్లులతో ముగ్గులు వేస్తూ ఆకట్టుకుంటున్నారు.
ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి ఆంధ్రజ్యోతి తరఫున ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు బహుమతులు అందజేస్తున్నారు.
ముగ్గుల పోటీల సందర్భంగా చిన్నారులు, మహిళలు, వృద్ధ మహిళలు సైతం నృత్యాలు చేస్తూ సందడి చేస్తున్నారు.
Related Web Stories
ప్రకృతి అందాలు.. సామాన్యుల వెతలు..
భలేగా ఉందని పాప్‌కార్న్‌ను తింటున్నారా
నేడు ఆంధ్రజ్యోతి ముత్యాల ముగ్గుల పోటీలు..
ఈ ఏడాది ఇలా చేస్తే విజయం మీదే