ఏపీలో ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి ముత్యాల ముగ్గుల పోటీలు ప్రారంభమయ్యాయి. ప్రతీ సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా ముత్యాల ముగ్గుల పోటీలను ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి నిర్వహిస్తోంది.
ఈ పోటీలో విజేతలకు ఆకర్షణీయమైన బహుమతులను అందజేయనుంది. ఈ పోటీలను న్యాయ నిర్ణేతలు పర్యవేక్షిస్తారు. ఉదయం 10 గంటలకు పోటీ మొదలవగా.. మధ్యాహ్నం 12 గంటలకు ముగియనుంది.
అందమైన రంగవళ్లులు వేసిన మహిళలను విజేతలుగా నిర్ణయించి నగదు పురస్కారాన్ని అందజేస్తారు. మొత్తం మూడు ముగ్గులను ఎంపిక చేసి బహుమతులు అందిస్తారు.
ముత్యాల ముగ్గుల్లో దేవతల రూపాలు… సంప్రదాయం, సృజనాత్మకత కలిసిన అందం
రంగురంగుల ముత్యాల ముగ్గులో అమ్మవారి దివ్య సౌందర్యం… సంక్రాంతి సంబరాలకు కళాత్మక శోభ
ఆంధ్రజ్యోతి ముత్యాల ముగ్గుల పోటీల్లో మహిళల ఉత్సాహం… రంగురంగుల కళతో మైదానం కళకళ
ముత్యాల ముగ్గులో అమ్మవారి ముఖచిత్రం… రంగుల సమ్మేళనంతో సంక్రాంతి శోభ