మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరం.. ఇది తెలిసినా.. చాలా మంది ఆల్కాహాల్ తాగుతుంటారు..
బీరును ఎక్కువగా తాగడం వల్ల శరీరానికి తీవ్రమైన హాని కలుగుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఎలాంటి వారు బీరు ఎక్కువగా తాగకూడదో తెలుసుకుందాం..
బరువు తగ్గాలనుకునే వారు, అధిక బరువు ఉన్నవారు బీర్ తాగకుండా ఉండటమే బెటర్.. ఎందుకంటే బీరులో ఎక్కువగా కేలరీలు ఉంటాయి..
షుగర్, ప్రీడయాబెటిస్ బాధితులు బీరుకు దూరంగా ఉండాలి.. బీర్ తాగితే షుగర్ కంట్రోల్ లో ఉండదని.. రక్తంలో చక్కెర శాతం వేగంగా పెరుగుతుందని పేర్కొంటున్నారు.
గుండెల్లో మంట, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఉన్న వారు బీరుకు దూరంగా ఉండాలి.. ఇది తాగితే.. ఈ సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉంది..
ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ సమస్య.. అంటే.. కడుపు, పేగులను ప్రభావితం చేసే వ్యాధితో బాధపడుతున్న వారు బీరుకు దూరంగా ఉండాలి..
అతిసారం, పొత్తికడుపు నొప్పి, తిమ్మిర్లు, కడుపు ఉబ్బరం, అపానవాయువు వంటి సమస్యలు ఉన్న వారు బీర్ తాగడం మానేయాలని సూచిస్తున్నారు.
బీరు తాగితే మూత్ర విసర్జన ఎక్కువ అవుతుంది. దీంతో శరీరంలో నీటి శాతం తగ్గి, కిడ్నీలపై అదనపు ఒత్తిడి పడుతుంది.
బీరు తక్కువ హానికరం” అన్న భావన పూర్తిగా తప్పు. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు బీరు తాగడం అంటే నెమ్మదిగా తమ ఆరోగ్యాన్ని నాశనం చేసుకోవడమే అని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.