పిల్లల్ని కన్న తర్వాత ఆక్టోపస్‌లు
ఎందుకు చనిపోతాయి..
భూమికి ఉండే ఇతర జీవులతో పోల్చితే ఆడ ఆక్టోపస్ జీవితం వింతైనది.
అన్ని జీవులకు అమ్మతనం మరో జన్మ అయితే, వీటికి మాత్రం అదే ఆఖరి శ్వాస.
ఇలా ఎందుకు జరుగుతుందో అసలు కారణాలు కనిపెట్టారు శాస్త్రవేత్తలు.
ఆడ ఆక్టోపస్‌లు వింతైన, విషాదకరమైన జీవిత చక్రాన్ని కలిగి ఉంటాయి.
సాధారణంగా ఇవి గుడ్లు పెట్టిన తర్వాత తినడం పూర్తిగా మానేస్తాయి.
పిల్లల్ని పొదిగేందుకు అలాగే నిద్రాహారాలు మాని కాచుకుని కూర్చుంటాయి. పిల్లల్ని పొదిగే ముందే చనిపోతాయి.
ఆక్టోపస్‌లు గుడ్లు పెట్టిన తర్వాత వాటిని రక్షించుకోవడానికి నిరంతరం గూటికి దగ్గరగా ఉంటాయి.
గుడ్లకు తగినంత ఆక్సిజన్ అందేలా చూసుకోవడానికి పూర్తిగా తమను తాము అంకితం చేసుకుంటాయి.
గుడ్లను పెట్టిన తర్వాత వాటిని జాగ్రత్తగా చూసుకోవడం మాత్రమే ప్రతి ఆడ ఆక్టోపస్ తన జీవితంలో చేసే చివరి పని కావడం విషాదకరం.
Related Web Stories
కారు నడిపేటప్పుడు.. ఈ జాగ్రత్తలు తీసుకోకుంటే ప్రమాదమే..
పొట్ట చుట్టూ కొవ్వు.. ఈ టిప్స్‌తో కరిగించుకోండి
చర్మానికి కొబ్బరి నూనె రాయడం వల్ల ఏమవుతుందో తెలుసా..?
ఏసీలో పిల్లలను పడుకోబెడుతున్నారా..? తస్మాత్ జాగ్రత్త..