ఏసీలో పిల్లలను పడుకోబెడుతున్నారా..?  తస్మాత్‌ జాగ్రత్త..

ఏసీ గాలి నేరుగా పిల్లలపై పడితే వారి శరీర ఉష్ణోగ్రత అసమతుల్యంగా మారతాయి. దీని వలన పిల్లల్లో రోగనిరోధక శక్తి బలహీనపడే అవకాశాలు ఎక్కువ

చిన్నపిల్లలు చలిని ఎక్కువగా ఫీలవుతారు. గది ఉష్ణోగ్రత ఎక్కువగా తగ్గితే జలుబు, దగ్గు, ముక్కు కారడం వంటి సమస్యలు మారతాయి

గదిలో ఉష్ణోగ్రతను 24°C నుండి 26°C మధ్య ఉంచితే వారు సురక్షితంగా నిద్రపోవచ్చు.

ఏసీ గదిలో పడుకునేటప్పుడు పిల్లలకు కాటన్ దుస్తులు వేయడం మంచిది.

ఏసీ గదిలో ఉండే వేళ పిల్లలకు సాధారణంగా దాహం అనిపించదు. కానీ శరీరంలోని తేమ తక్కువై డీహైడ్రేషన్ కి దారితీసే ప్రమాదం ఉంటుంది.

ఏసీ ఫిల్టర్లు ధూళితో నిండిపోతే వాటి ద్వారా వచ్చే గాలి ఆరోగ్యానికి హానికరం.వారానికి ఒకసారి అయినా ఫిల్టర్లను శుభ్రం చేయడం చాలా ముఖ్యం.

గది చల్లబడిన తరువాత పిల్లలు నిద్రలోకి వెళ్లిపోయాక ఏసీని ఆఫ్ చేయాలి. దీని వలన సహజ గాలి గదిలోకి ప్రవేశిస్తుంది.