సులభంగా టేకాఫ్ అవ్వడం, ప్రెడేటర్ రక్షణ, శక్తి పరిరక్షణ వివిధ కారణాల వల్ల గబ్బిలాలు తలక్రిందులుగా వేలాడుతూ ఉంటాయి.
అవి పక్షుల్లాగా వెంటనే ఎగరడానికి వేగాన్ని పెంచుకోలేవు. తలకిందులుగా వేలాడటం వల్ల అవి పడిపోతాయి. అప్పుడు గురుత్వాకర్షణ శక్తిని ఉపయోగించుకుని తక్షణమే ఎగురుతాయి.
వాటి పాదాలలో ఒక ప్రత్యేకమైన స్నాయువు వ్యవస్థ వాటి గోళ్లను లాక్ చేస్తుంది. వేలాడటానికి వాటికి కండరాల ప్రయత్నం అవసరం లేదు. వాటికి పట్టును వీడటానికి మాత్రమే శక్తి అవసరం అవుతుంది.
గుహలలో లేదా చెట్లలో ఎత్తైన ప్రదేశాల్లోనే ఇవి ఉంటాయి. తద్వారా భూమిపై వేటాడే జంతువుల నుంచి రక్షణ పొందుతాయి. గబ్బిలాలు ఉన్న స్థానం ఇతర జంతువులు చేరుకోవడం కష్టం.
తలకిందులుగా ఉండటం వలన గబ్బిలాల్లో రక్త ప్రసరణ సక్రమంగా జరుగుతుంది.
గబ్బిలాలు ఇతర జంతువులు, పక్షులు సంచరించలేని ప్రదేశాల్లోనే ఉంటాయి. దీని వలన వాటికి పోటీ తగ్గుతుంది.
గబ్బిలం ఏదైనా చెట్టుపై దిగినప్పుడు గోళ్లతో దాని ఉపరితలాన్ని పట్టుకుంటుంది. ఆ సమయంలో శరీరాన్ని సడలిస్తుంది. దాని బరువు పాదాలకు అనుసందానం చేసి స్నాయువులను లాగుతుంది. దీనివల్ల గబ్బిలం పంజాలు గట్టిగా లాక్ అవుతాయి.
ఇక గబ్బిలం ఎగరడానికి.. తన పంజాలను తెరవడానికి కండరాలను కదిలిస్తుంది. పట్టును విడుస్తుంది. ఆపై ఎగిరిపోతుంది.