కొబ్బరి చెట్టులోని ప్రతి భాగం  ఉపయోగకరంగా ఉంటుంది.

కొబ్బరిలోని పోషక విలువలు ఆరోగ్యానికి  ఎంతో మేలు చేస్తాయి..

కొబ్బరిని ఇంటికి పెద్ద కొడుకు అని పిలుస్తారు. దానిలోని ప్రతి భాగం ఉపయోగకరంగా ఉంటుంది.

అంతర్జాతీయ కొబ్బరి సంఘం (ICC) 1969 సెప్టెంబర్ 2న ఐక్యరాజ్యసమితి ఆసియా, పసిఫిక్ ఆర్థిక, సామాజిక కమిషన్ (UN-ESCAP) ఆధ్వర్యంలో స్థాపించింది.

ఈ దినోత్సవాన్ని గుర్తుచేసుకునేందుకు సెప్టెంబర్ 2న ప్రపంచ కొబ్బరి దినోత్సవాన్ని జరుపుకుంటారు.

కొబ్బరి  ప్రధాన కార్యాలయం ఇండోనేషియాలోని జకార్తాలో ఉంది. భారత్‌తో సహా అనేక దేశాలు ఈ సంస్థలో సభ్యులుగా ఉన్నాయి.

మన దైనందిన జీవితంలో కొబ్బరి ప్రాముఖ్యతను, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై  ప్రభావాన్ని గుర్తించడానికి ప్రపంచ కొబ్బరి దినోత్సవాన్ని జరుపుకుంటారు.

ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 2న జరుపుకునే ఈ దినోత్సవం ముఖ్యంగా లక్షలాది మంది రైతులకు కొబ్బరి ప్రధాన ఆదాయ వనరు, జీవనోపాధిగా ఉంటుంది.