పగిలిన పెదాలు స్మూత్‌గా మారాలంటే..!

శీతాకాలం లేదా వేసవిలో పెదాలు పగుళ్లు రావడం సర్వసాధారణం. కానీ, శరీరంలో వేడి పెరగడం, ఇతర సమస్యలు కూడా ఈ సమస్యకు కారణమవుతాయి.

లిప్ బామ్ పెదవులను తేమగా ఉంచడానికి సహాయపడుతుంది. పగుళ్లు రాకుండా నిరోధిస్తుంది. ఇందులోని మాయిశ్చరైజింగ్ పదార్థాలను పెదాలను మృదువుగా చేస్తాయి.

కొబ్బరి పెదాల పగుళ్లకు సహజ పరిష్కారం. ఇందులోని కొవ్వు ఆమ్లాలు పెదాల పగుళ్ల వల్ల కలిగే మంటను పోగొట్టి పగుళ్లు రాకుండా నిరోధిస్తాయి.

తేనె పెదవులను తేమగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇందులోని యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు పెదవులను ఆరోగ్యంగా ఉంచుతాయి.

బంగాళాదుంప రసంలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి పెదవుల ఆరోగ్యాన్ని కాపాడటంలో సమర్థంగా పనిచేస్తాయి.

పెరుగులోని లాక్టిక్ ఆమ్లం పెదాల పగుళ్లను పోగొడుతుంది. నిర్జీవంగా ఉన్న పెదాలను కాంతివంతంగా మారుస్తుంది.

రోజ్ వాటర్ ముఖ సౌందర్యంతో పాటు పెదాల సంరక్షణకూ సాయపడతాయి. ఇవి తరచూ పెదాలకు రాస్తే పగుళ్లు రావు.