విద్యుత్ షాక్‌కు గురైనప్పుడు వెంటనే చేయాల్సిన పనులివే..

ఎవరికైనా కరెంట్ షాక్ కొడితే వెంటనే పవర్ బటన్ స్విచ్ ఆఫ్ చేయండి.

 చీపురు ,చెక్కతో ఆ మనిషి నుండి విద్యుత్ కనెక్షన్ ను దూరం చేయండి.

అలాగే అతనికి శ్వాస ఆగుతుందో లేదో చూడండి. గుండె కొట్టుకుంటుందో లేదో కూడా పరిశీలించండి.

శ్వాస తీసుకోకపోయినా, గుండె కొట్టుకోకపోయినా వెంటనే CPR చేయండి. అంటే గుండె మధ్యలో రెండు చేతులతో వేగంగా నొక్కండి.

ఆ వ్యక్తిని వీలైనంత త్వరగా ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించాలి.

తడిచేతులు, తడి కాళ్లతో కరెంట్ వైర్లు జోలికి వెళ్లకూడదు. 

 వీలైనంతగా ఎవరి జాగ్రత్తలో వారు ఉండడం చాలా మంచిది.