జుట్టుకు కలర్లను అప్పుడప్పుడు వేయడం వల్ల పెద్దగా వచ్చే సమస్యలేమీ లేవు
కానీ వీటిని తరచుగా వాడితేనే ప్రాబ్లమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
తరచుగా హెయిర్ డై లను వాడే ఆడవారికి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం 9% ఎక్కువగా ఉందని ఒక అధ్యయనం పేర్కొంది.
కెమికల్ హెయిర్ డై, స్ట్రెయిటెనర్లను వాడే మహిళలకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే రిస్క్ 30% ఎక్కువగా ఉందని కూడా ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ క్యాన్సర్ లో ప్రచురితమైంది
ఎండోక్రైన్-డిస్‌రప్టింగ్ కాంపౌండ్స్ (EDCs): అంటే ఇవి మన శరీరంలో హార్మోన్లను అసమతుల్యంగా చేస్తాయి.
ఇది సంతానోత్పత్తి సమస్య, క్యాన్సర్ వంటి సమస్యలకు దారితీస్తాయి.
తరచుగా జుట్టుకు కలర్ ను వేయడం వల్ల జుట్టు మూలాలు బలహీనపడతాయి.