రాత్రిపూట స్నానం చేస్తున్నారా..?  ఈ విషయాలు తెలుసుకోండి..

రాత్రిపూట స్నానం చేయడం వల్ల పగటిపూట పేరుకుపోయిన దుమ్ము, మురికి, చెమట తొలగిపోతాయి, ఇది మంచి నిద్రకు సహాయపడుతుంది, అయితే

రాత్రిపూట వేడి నీటితో స్నానం చేస్తే శరీర ఉష్ణోగ్రత పెరిగి నిద్రకు భంగం కలగవచ్చు. చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల విశ్రాంతి లభిస్తుంది.

 రాత్రి సమయంలో వేడి నీటితో స్నానం చేయడం వల్ల గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది.

రాత్రి సమయంలో సాధారణ స్నానం చేస్తే కలిగే నష్టాల కన్నా, తల స్నానం మరిన్ని ఎక్కువ నష్టాలు కలిగిస్తుంది. .

పడుకోవడానికి కనీసం 2గంటల ముందు స్నానం చేయాలని వైద్యులు సలహా ఇస్తున్నారు.

రాత్రి తల స్నానం తరువాత జుట్టు సరిగా ఆరకముందే నిద్రపోతే అది సైనస్ వంటి సమస్యలకు దారితీస్తుంది.    

స్నానం చేసే సమయం వ్యక్తిగత అలవాటు, జీవనశైలిపై ఆధారపడి ఉంటుంది