బంగారం కొంటున్నారా?  ఈ  విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

మీరు బంగారం కొనేటప్పుడు BIS హాల్ మార్క్ చేసిన బంగారాన్ని కొనండి.

ఎందుకంటే.. ఇది బంగారం స్వచ్ఛతను, ప్రామాణికతను నిర్ధారిస్తుంది. ఈ హాల్‌మార్క్ బంగారం నాణ్యతకు హామీ ఇస్తుంది.

బంగారం ధరలు కేవలం గోల్డ్ మార్కెట్లపైనే ఆధార పడి ఉండవు. తయారీ చార్జిలు, తరుగు, డిజైన్ వంటి అనేక రకాల ఖర్చులు మీద పడతాయి.

ఇక డిజైన్‌లు ఎక్కువగా ఉన్న బంగారం నగల ధలు ఎక్కువ. ఈ డిజైనర్ నగలు తక్కువగా లభిస్తుండటమే ఇందుకు కారణం.

అత్యధిక నైపుణ్యంతో వీటిని తయారు చేస్తారు కాబట్టి ఆ మేరకు ధరల్లో కూడా మార్పులు కనిపిస్తాయి.

కాబట్టి, భవిష్యత్తు అవసరాల కోసం పెట్టుబడిగా బంగారం కొనుగోలు చేయాలనుకునే వారు స్వచ్ఛతకే పెద్దపీట వెయ్యాలి.

 ఎవరికైనా బహుమతిగా బంగారం ఇవ్వాలనుకుంటే మాత్రం స్వచ్ఛతతో పాటు, బరువు, ధర వంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాలి.