పసుపు  రోజూకు ఎంత వాడాలో తెలుసా..

పసుపు ఆరోగ్యానికి మేలు చేస్తుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు అయితే.

 ఆరోగ్యానికి మేలు చేసే పసుపును ఎక్కువగా తీసుకుంటే ఇబ్బందులు తప్పవని అంటున్నారు.

పసుపును మోతాదుకు మించి తీసుకోవడం వల్ల శరీరంలో కొన్ని మార్పులు సంభవిస్తాయని చెబుతున్నారు.

పసుపును ఎక్కువగా తీసుకోవడం వల్ల చర్మ సంబధిత సమస్యలకు దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు.

 పసుపును ఎక్కువగా తీసుకోవడం వల్ల లివర్‌ ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది.

ఇది కాలేయ ఎంజైమ్‌లను పెంచడం ద్వారా కాలేయ పనితీరును ప్రభావితం చేస్తుంది. దీంతో లివర్‌ పనితీరును దెబ్బతీస్తుంది.

ఒక వ్యక్తి రోజుకు కేవలం 500 నుంచి 2000 మిల్లీగ్రాముల పసుపును ఆహారంలో భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు. అంతకు మించి తీసుకుంటే ఇబ్బందులు వస్తాయని అంటున్నారు.