ఒకే టవల్‌ను రోజుల తరబడి వాడడం వల్ల అనేక దుష్ప్రభావాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

టవళ్లను మూడు సార్లు ఉపయోగించిన తర్వాత ఉతికేయాలి. లేదంటే అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. 

టవల్స్‌ను శుభ్రం చేయకుండా ఎక్కువ రోజులు ఉపయోగించడం వల్ల అందులో ఫంగల్ ఇన్ఫెక్షన్ల ప్రమాదం పెరుగుతుంది.

టవళ్లలో బ్యాక్టీరియా, దుమ్ము, ధూళితో పేరుకుపోయి ఉంటుంది. ఇది ముఖంపై మొటిమలు, చర్మ వ్యాధులకు దారి తీస్తుంది. 

ఒకే టవల్‌ను ఎక్కువ రోజులు వాడడం వల్ల గాయాలు మానడానికి ఆలస్యమవుతుంది.

టవళ్లను శుభ్రం చేయకపోవడం వల్ల కంటి కన్ఫెక్షన్లకు కూడా దారి తీస్తుంది.

టవళ్లలోని హారికరమైన బ్యాక్టీరియా మన శరీరంలోకి వెళ్లి, రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది.

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.