20 కిలోలు తగ్గాలంటే ఈ త్యాగాలు చేయాల్సిందే..

బరువు తగ్గడం అంత ఈజీ కాదు. క్రమశిక్షణ, నిబద్ధత చాలా ముఖ్యం.

మీరు కూడా బరువు తగ్గాలని భావిస్తున్నారా? అయితే సోడా, మాల్ట్, షుగర్ డ్రింక్స్, ఆల్కహాల్ వంటివి మానేయండి.

వీటిలో చాలా ఎక్కువ కేలరీలు ఉంటాయి. ఇవి బరువును వేగంగా పెంచుతాయి.

వీటికి బదులుగా నీళ్లు, గ్రీన్ టీ, జింజర్ లెమన్ వాటర్, డీటాక్స్ టీ వంటివి తాగడం మంచిది.

బయటి ఆహారం ఆకర్షణీయంగా ఉన్నా, అవి అనవసరమైన కేలరీలను మీ శరీరానికి అందిస్తాయి.

ఇంట్లో వండిన ఆహారం తినడం అలవర్చుకోండి. ఇది మీ ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు.. డబ్బును కూడా ఆదా చేస్తుంది.

రోజుకు కనీసం 10,000 అడుగులు నడవాలని లక్ష్యంగా పెట్టుకోండి. భోజనం తర్వాత నడిస్తే ఇంకా మేలు జరుగుతుంది.

మెట్లు ఎక్కడం, ఇంట్లో డ్యాన్స్ వంటివి చేయండి. ఇవన్నీ కొవ్వును కరిగించడానికి సహాయపడతాయి.

వారానికి 2-3 సార్లు బాడీవెయిట్ వ్యాయామాలు చేయడం వల్ల బాడీ ఫ్యాట్ తగ్గి ఫిట్‌గా మారుతారు.

ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది