కొందరికి ఉదయాన్నే నిద్ర లేవడం పెద్ద సవాలు. ఇలాంటి వారు పాటించాల్సిన టిప్స్ ఏంటంటే..

లేవగానే సూర్యరశ్మి శరీరానికి తగిలితే మెలటోనిన్ ఉత్పత్తి తగ్గుతుంది. బద్ధకం క్షణాల్లో వదిలిపోతుంది.

రాత్రిళ్లు చక్కెర అధికంగా ఉన్న ఆహారం తినకుండా ఉంటే ఉదయం పూట త్వరగా మెళకువ వస్తుంది.

రాత్రిళ్లు మనసు రిలాక్స్ అయ్యేలా చేసుకుని నిద్రిస్తే మరుసటి ఉదయం త్వరగా మెళకువ వస్తుంది

ఓ మాదిరి శబ్దంతో అలారం మోగేలా సెట్ చేసుకుంటే ఉదయం చిరాకు లేకుండా ఉత్సాహంగా మేల్కొనవచ్చు

నిద్ర లేవగానే ఒంటిని స్ట్రెచ్ చేసుకుంటే రక్తప్రసరణ మెరుగై మత్తు వదిలిపోతుంది. ఉత్సాహం వస్తుంది. 

రాత్రిళ్లు గది కాస్త చల్లగా ఉండేలా చూసుకుంటే మంచి నిద్రపట్టి ఉదయాన్నే త్వరగా లేవగలుగుతారు. 

మెగ్నీషియం సమృద్ధిగా ఉన్న ఆహారాలతో రాత్రి మంచి నిద్రపట్టి మరుసటి ఉదయం సులువుగా మెళకువ వస్తుంది.