కొన్ని చిట్కాలు పాటిస్తే ఆఫీసులో మీ పనితీరు కచ్చితంగా మెరుగవుతుంది

పనిలో గంటల తరబడి లీనమైపోకుండా అప్పుడప్పుడూ కాస్త బ్రేక్ తీసుకోవాలి

90 నిమిషాల పాటు ఆపకుండా పని చేశాక కనీసం 15 నిమిషాల పాటు బ్రేక్ ఇస్తే బెటర్

ఇలా చేస్తే మానసిక అలసట తగ్గి సృజనాత్మకత పెరుగుతుంది

మీరు పని చేసే డెస్క్‌పై వస్తువులను చిందరవందరగా కాకుండా క్రమ పద్ధతిలో సర్దుకోవాలి

మీ పనికి కావాల్సిన వస్తువులనే డెస్క్‌పై ఉంచాలి

ఇంట్లో అయినా ఆఫీసులో పనిచేస్తున్నా ప్రశాంతమైన వాతావరణం ఉంటే మరింత మెరుగైన ఫలితం ఉంటుంది. 

చేయాల్సిన పని గురించి పూర్తి అవగాహన ఉంటే డెడ్‌లైన్‌కు ముందే పని పూర్తయిపోతుంది.