ఈ వస్తువులను పొరపాటున  విమానంలో తీసుకెళ్లకూడదు...

విమాన ప్రయాణం చేసేటప్పుడు కొన్ని నియమాలు ఉంటాయి.

కొన్ని రకాల వస్తువులు విమానం ప్రయాణంలో తీసుకెళ్లకూడదు.

 అలా తీసుకెళ్తే ప్రయాణం సమయంలో మీకు ఇబ్బందులు ఎదురుకావచ్చు.

విమానంలో కత్తులు, కత్తెరలు వంటి పదునైన వస్తువులను తీసుకెళ్లకూడదు.

ఎందుకంటే ఇవి ఇతర ప్రయాణికులకు లేదా సిబ్బందికి ప్రమాదకరం కావచ్చు.

లైటర్లు, అగ్గిపెట్టెలు వంటి సులభంగా మంటలు వ్యాపించే వస్తువులు తీసుకెళ్లకూడదు.

100 మిల్లీలీటర్ల కంటే ఎక్కువ ద్రవాన్ని తీసుకెళ్లేందుకూ అనుమతి లేదు.

అయితే కొన్ని నిబంధనల ప్రకారం ఈ-సిగరెట్లను మాత్రం తీసుకెళ్లవచ్చు.

బేస్ బాల్ బ్యాట్, హాకీ స్టిక్, గోల్ఫ్ క్లబ్, విల్లు, బాణం వంటి క్రీడా వస్తువులు తీసుకెళ్లలేం.

 పవర్‌ బ్యాంకులు, బ్యాటరీలు వంటివి కూడా విమానాల్లోకి అనుమతి ఉండదు.