నోరూరించే స్పెషల్ టమాటా పచ్చడి..  ఇలా ఈజీగా చేసేయండి..

కావలసిన పదార్థాలు: టమాటాలు – 3, పచ్చి మిరపకాయలు – 2  వెల్లుల్లి రెబ్బలు – 3, నూనె – 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు – 1 టీస్పూన్.

మినప్పప్పు – 1 టీస్పూన్, ఎండుమిరపకాయ – 1, కరివేపాకు – కొద్దిగా, ఉప్పు – తగినంత, చింతపండు – చిన్న ముక్క.

తయారీ విధానం: ఒక పాన్‌లో 1 టేబుల్ స్పూన్ నూనె వేసి వేడయ్యాక టమాటా ముక్కలు, పచ్చి మిరపకాయలు, వెల్లుల్లి వేసి వేపాలి.

టమాటాలు బాగా మెత్తబడే వరకు వండాలి. చింతపండు ఉంటే అప్పుడే వేసుకోవచ్చు.

దీన్ని గట్టి పేస్ట్ లేదా కొద్దిగా రఫ్‌గా మెత్తగా గ్రైండ్ చేయాలి.

మరో పాన్‌లో మిగిలిన నూనె వేసి ఆవాలు, మినప్పప్పు, ఎండుమిరపకాయ, కరివేపాకు వేయాలి.

అవి చిటపటలాడిన తరువాత గ్రైండ్ చేసిన మిశ్రమం వేసి బాగా కలిపి 2–3 నిమిషాలు వండాలి.

చివరగా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. అంతే.. రుచికరమైన టమాటా పచ్చడి రెడీ.

ఈ పచ్చడిని వేడి అన్నంలో కలిపి తింటే అమృతమే..