కర్పూరం కేవలం పూజా సామగ్రి మాత్రమే కాదు.. ఇది ఆరోగ్యానికి ఒక వరం

కర్పూరం మతపరమైన ప్రయోజనాలకే కాకుండా ఆరోగ్యం, అనేక గృహ అవసరాలకు కూడా ఉపయోగపడుతుంది

కర్పూరంతో తయారు చేసే నూనె మసాజ్ చేయడానికి మంచిదని భావిస్తారు. ఇది కీళ్ల నొప్పులు తగ్గిస్తుంది

జలుబు ఉన్నప్పుడు కర్పూరం ఆవిరి పీల్చడం వల్ల శ్వాస తీసుకోవడంలో ఉపశమనం లభిస్తుంది

చర్మ సమస్యలైన బొబ్బలు, దురద, మంట వంటి వాటికి కొబ్బరి నూనెతో కలిపి కర్పూరం పూయడం వల్ల ఉపశమనం లభిస్తుంది

కర్పూరం జుట్టుకు కూడా మేలు చేస్తుంది. కొబ్బరి నూనెతో కలిపి కర్పూరం రాయడం వల్ల చుండ్రు తగ్గుతుంది. జుట్టు రాలడాన్ని నివారిస్తుంది

దోమలు, కీటకాల వల్ల మీరు ఇబ్బంది పడుతుంటే, ఇంట్లో కర్పూరం కాల్చండి. అవి పారిపోతాయి.