వృక్షశాస్త్రం ప్రకారం టామాటా ఒక పండు. కానీ జనాల్లో మాత్రం కూరగా పేరు పడింది.

దక్షిణ అమెరికాలోని పెరూ, ఈక్వెడార్ దేశాల్లోని ఆండస్ పర్వత శ్రేణుల్లో టమాటాలను తొలిసారిగా గుర్తించారు. 

స్థానిక ప్రజలకు అక్కడ లభించే టమాటాలను తొలిసారిగా వినియోగించడం ప్రారంభించారు. 

ఆ తరువాత స్పెయిన్ ప్రజలు టమాటాలను 16వ శతాబ్దంలో ఐరోపాకు పరిచయం చేశారు. 

వీటిని లెడ్ ప్లేట్స్‌పై పెట్టుకుని తిన్న జనాలు అనారోగ్యం పాలవడంతో వీటికి విషపు యాపిల్స్‌గా పేరుపడింది. 

కాలక్రమంలో మధ్యధరా సముద్ర ప్రాంతంలోని వారి ఆహారంలో టమాటాలు ప్రధాన వంటకంగా మారాయి. 

కెచప్, సాస్‌లో వాడటంతో అమెరికాలో కూడా 19వ శతాబ్దంలో టమాటాలకు డిమాండ్ పెరిగింది. 

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 10 వేల రకాల టమాటా జాతులు అందుబాటులో ఉన్నాయి.