కళ్ల కింద నల్లటి వలయాలను
తగ్గించే చిట్కాలు..
ఒత్తిడి, నిద్రలేమి, హార్మోన్ల మార్పులు, జీవన శైలిలో మార్పులు.. ఇలా రకరకాల కారణాల వల్ల కళ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడతాయి.
దోసకాయను గుండ్రని ముక్కలుగా కట్ చేసుకోవాలి.. కళ్లు మూసుకుని ఆ ముక్కలను మీ కనురెప్పలపై పెట్టుకోండి..అలా 10 నుండి 15 నిమిషాల పాటు కళ్లు మూసుకోండి..
కీరదోసకాయలో యాంటీఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు అధికంగా ఉంటాయి. ఇవి కళ్ల మంటను తగ్గించడంలో, నల్లటి వలయాలను తొలగించడంలో సహాయపడతాయి.
పాలలో ముంచి కళ్ల కింద రాయాలి. ఇలా పది నిమిషాలసేపు చేయాలి. చివరిగా చల్లని నీళ్లతో ముఖం శుభ్రం చేసుకోవాలి.
అలొవెరాను జెల్‌ను కళ్ల కింద భాగంలో రాయాలి. ఇరవై నిమిషాల తరువాత చల్లటి నీటితో కడగాలి. ఇలా చేయడం వల్ల నల్లటి వలయాలు పొతాయి
టమోటాను కట్ చేసి ముక్కలను కళ్లపై పెట్టుకోవాలి. పావుగంట పాటు అలా వదిలేస్తే మంచి ప్రయోజనం ఉంటుంది.
బంగాళదుంపను గుజ్జుగా చేసి, ఆ గుజ్జును కళ్లపై పావుగంట పాటు ఉంచితే చాలు మంచి ఫలితం ఉంటుంది.
Related Web Stories
అమెజాన్ అడవుల్లో కనిపించే భయానక విష సర్పాలు
పాముకు గుండె ఎక్కడ ఉంటుందో తెలుసా?
సంతోషంగా జీవించడానికి 7 మార్గాలు
డయాబెటిస్‌ను నిద్ర ఎలా కంట్రోల్ చేస్తుంది..?