మనుషుల్లాగే పాముకీ కూడా గుండె ఉంటుంది. అది వాటి శరీరంలో రక్తప్రసరణను నియంత్రిస్తుంది.
పాములలో గుండె స్థిరంగా ఒక చోట ఉండదు. సాధారణంగా పాములను మూడు భాగాలుగా విభజిస్తే తల ఉన్న ప్రాంతంలో మెదడు, నాలుక,కోరలు, విషగ్రంధులు ఉంటాయి. మధ్యభాగంలో గుండె, చిన్న పేగులు, తోక ప్రాంతంలో పెద్ద పేగులు ఉంటాయి.
పాముల గుండె తల నుండి సుమారు మొత్తం శరీరం పొడవులో 1/4 భాగంలో, అంటే గొంతు దగ్గర భాగంలో ఉంటుంది.
ఆ స్థానం వల్ల గుండె రక్తాన్ని తల, ఊపిరితిత్తులు, తోక భాగాలకు సులభంగా పంపిస్తుంది.
వాటి అవయవాలు పొడవుగా ఉంటాయి. కాబట్టి గుండె కూడా శరీర మధ్య భాగానికి దగ్గరగా కదిలి ఉండొచ్చు. జాతిని బట్టి మారుతుంది.
పాము గుండె పరిస్థితులను బట్టి తన శరీరంలో పొజిషన్‌ను మార్చుకుంటూ ఉంటుంది.
అవి పొడవుగా ఉన్న శరీరానికి తగ్గట్టుగా చిన్నగా కానీ బలంగా ఉంటుంది. నిరంతరం రక్తం పంపిస్తుంది.
పాముల గుండె నిమిషానికి 50–80 సార్లు కొట్టుకుంటుంది. ఉష్ణోగ్రత, జీర్ణక్రియ స్థితి ఆధారంగా ఇది మారుతుంది.
పాముల గుండె కొంతసేపు వేరుపడ్డా కూడా కొట్టుకుంటుంది. అందుకే ఇది ఆశ్చర్యపరిచే విషయం.
పాముల గుండె వేరు జంతువుల కంటే మరింత అనుకూలంగా ఉంటుంది. అవి నేల మీద, చెట్ల మీద కదిలినా రక్తప్రసరణ సరిగ్గా కొనసాగుతుంది.