గంధం
ఆ చర్మ సమస్యలకు వరం..
ఒక గిన్నెలో ఒక చెంచా గంధం పొడి, చిటికెడు పసుపు, చిటికెడు కర్పూరం పొడి, రెండు చెంచాల నీళ్లు కలిపి.
ఆ మిశ్రమాన్ని రాత్రి పడుకునే ముందు ముఖానికి రాసుకుని ఉదయాన్నే గోరువెచ్చని నీళ్లతో కడిగేసుకుంటే మొటిమలు రావు.
ఒక చెంచా గంధం పొడికి ఒక చెంచా కొబ్బరి నూనె కలిపి ఈ మిశ్రమాన్ని ముఖానికి సున్నితంగా మర్దన చేస్తే మొటిమల వల్ల వచ్చే మచ్చలు పోతాయి.
ఎండ వల్ల ఏర్పడే నలుపుదనం, కళ్ల కింద నల్లని వలయాలు తగ్గుతాయి.
ఒక గిన్నెలో రెండు చెంచాల ముల్తానీ మట్టి, రెండు చెంచాల గంధం పొడి వేసి మూడు చెంచాల గులాబీ నీళ్లు చల్లుతూ బాగా కలపాలి.
ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు పట్టించి ఇరవై నిమిషాలు ఆరనివ్వాలి.
తరవాత చల్లని నీళ్లతో శుభ్రం చేసుకుంటే చర్మం నిగారిస్తుంది. నుదుటి మీద, పెదాల చుట్టూ ముడతలు రావు. మెడ భాగంలో నలుపు తగ్గుతుంది.
Related Web Stories
కర్పూరం ఇలా కూడా పని చేస్తుందా?
గులాబీ చెట్టు పూలు పూయట్లేదా?..ఈ చిట్కా ఫాలో అవ్వండి.
జాగ్రత్త.. ఈ లక్షణాలను లైట్ తీసుకోకండి..
టమాటాల చరిత్ర గురించి తెలుసా?