చర్మ సౌందర్యం కోసం ఈ ఒక్క  గ్లాస్ జ్యూస్..

జామకాయ జ్యూస్ వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. 

జామకాయ అద్భుతమైన పండన్న సంగతి అందరికి తెలిసిందే. వీటిని తీసుకోవడం వల్ల శరీరంలోని ప్రతి అవయవానికి ప్రయోజనం చేకూరుతుంది.

ఈ జ్యూస్‌లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి.

మలబద్దకాన్ని నివారిస్తోంది. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.

దగ్గు, జలుబును దూరం చేస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

నోటి సంరక్షణతోపాటు రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచిది.

కంటి ఆరోగ్యానికి మంచిది. రోగ నిరోధక వ్యవస్థను పెంచుతుంది. 

వృద్ధాప్య లక్షణాలను నిరోధిస్తుంది. మెదడు శక్తిని పెంచుతుంది.

శరీర కాంతిని పెంచడమే కాకుండా.. జుట్టు సహజంగా మెరిసేలా చేస్తోంది. 

బరువు తగ్గడంతోపాటు రక్తపోటు నియంత్రిస్తుంది.