మీ జట్టు తళతళ మెరవాలంటే  ఈ నూనె వాడాల్సిందే..

జుట్టు చివర్లు విరగకుండా మృదువుగా ఉండేందుకు మునగ నూనె సాయపడుతుంది. వాతావరణ కాలుష్యం నుంచి సంరక్షిస్తుంది.

మునగ నూనె అన్ని రకాల వెంట్రుకలకు బాగా పని చేస్తుంది. విరిగిన జుట్టును కూడా తిరిగి సాధారణ స్థితికి తీసుకొస్తుంది.

సహజంగానే స్వచ్ఛమైన మునగ నూనెలో ఉండే యాంటి ఇన్ఫ్లమేటరీ లక్షణాలు జుట్టుకు మేలు చేస్తాయి.

మునగ నూనెలోని విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, కొవ్వు ఆమ్లాలు.. జుట్టు పొడిబారకుండా చేయడంలో సాయపడతాయి.

జుట్టు సంరక్షణతో పాటూ చర్మ సంరక్షణకూ దోహదం చేస్తుంది. వృద్ధాప్య లక్షణాలను తగ్గించడంలో సాయపడుతుంది.

చర్మంపై నల్లటి మచ్చలు, మొటిమల వల్ల ఏర్పడిన మచ్చలను తొలగించడంతో పాటూ ముడతలు పడకుండా నివారిస్తుంది.