ఈ మొక్కలను ఇంట్లో పెంచుకుంటే..  అదృష్టం మీ వెంటే..

మనీ ప్లాంట్‌ను ఇంట్లో పెంచుకుంటే సంపద, అృదృష్టం కలిసి వస్తాయని చాలా మంది భావిస్తారు. పైగా ఇవి ఇంటికి చాలా అందాన్నిస్తాయి.

చిన్న వెదురు మొక్కలను ఇంట్లో పెంచుకుంటే అదృష్టం తలుపు తడుతుందని కొందరు నమ్ముతారు. వెదురు మొక్కలను పెంచుకుంటే సానుకూల శక్తి పెరుగుతుందట.

స్నేక్ ప్లాంట్‌ను ఇంట్లో పెంచుకుంటే రక్షణ, అదృష్టం, శ్రేయస్సు వెంటే ఉంటాయని కొందరి విశ్వాసం. ఈ మొక్క ఇంట్లోని గాలిని శుద్ధి చేస్తుంది.

బొద్దుగా, దళసరి ఆకులతో కూడిన జాడే ప్లాంట్‌ను ఉదయాన్నే చూస్తే చాలా మంచిదని అనేక సంస్కృతుల వారు నమ్ముతారు. ఈ మొక్క అదృష్టం, సంపదను తీసుకొస్తుందట.

శాంతి, ప్రశాంతతను సూచించే పీస్ లిల్లీ మొక్కను ఇంట్లో పెంచుకునేందుకు చాలా మంది ఇష్టపడతారు. ఈ మొక్క కూడా ఇంట్లోని గాలి నాణ్యతను మెరుగుపరుస్తుంది.

తులసి మొక్కను లక్ష్మీదేవికి ప్రతిరూపంగా భావించి పూజిస్తారు. తులిసి ఆకులు ఔషధ విలువలను కలిగి ఉంటాయనే సంగతి తెలిసిందే.

చూడడానికి చాలా అందంగా కనిపించే ఫెర్న్ మొక్కలు అభివృద్ధి, పాజిటివ్ ఎనర్జీని అందిస్తాయట. ఈ మొక్క కూడా ఇంట్లోని గాలిని ప్యూరిఫై చేస్తుంది.

పెద్దగా, నిగనిగలాడే ఆకులు కలిగి ఉండే రబ్బర్ ప్లాంట్ ఇంటికి అదృష్టాన్ని, సానుకూల శక్తిని తీసుకొస్తుందని నమ్ముతారు.

ఇంటికి అందాన్ని తీసుకొచ్చే మనోహరమైన ఆఫ్రికన్ వైలెట్ మొక్కలు ఆప్యాయత, భక్తి, అదృష్టాన్ని సూచిస్తాయి.