వయసు పెరిగే కొద్ది కీళ్ల నొప్పులు రావడం సహజమే. కానీ, ఈ మధ్య కాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలామంది కీళ్ల నొప్పుల బారిన పడుతున్నారు
కొన్ని రోజువారీ అలవాట్లు కూడా మీ కీళ్ల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తూ నొప్పికి కారణమవుతాయి. మరి, ఏ అలవాట్ల వల్ల ఈ సమస్యలు వస్తాయో వివరంగా తెలుసుకుందాం.
దీనికి పలు కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా కీళ్లలోని మృదులాస్థి (cartilage) అరిగిపోవడం, అధిక బరువు వల్ల మోకాళ్లపై ఒత్తిడి పెరగడం వంటి అంశాలు ముందుగా చెప్పుకోవచ్చు
అనారోగ్యకరమైన జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్లు, విటమిన్ డి, కాల్షియం లోపం, ఎముకల సాంద్రత తగ్గడం వల్ల నడుము నొప్పి, మోకాలి నొప్పి సమస్యలు వస్తాయని వైద్యనిపుణులు చెబుతున్నారు.
పని ఒత్తిడి కారణంగా చాలా మంది ఒకే చోట బలవంతంగా 8 గంటలకు పైగా కూర్చుని పని చేస్తారు. దీనివల్ల రక్త ప్రసరణ సరిగా ఉండదు. ఇది వెన్నునొప్పి, మోకాలి నొప్పికి దారితీస్తుంది.
చక్కెర ఆహారాలు, నూనె పదార్థాలు, ప్రాసెస్ చేసిన మాంసాలు, ఆల్కహాల్ అధికంగా తీసుకోవడం వల్ల కూడా మోకాలి నొప్పికి కారణం అవుతాయి.
బరువు తగ్గడం,వ్యాయామాలు వల్ల మోకాళ్లపై ఒత్తిడి తగ్గి నొప్పిని నియంత్రించడంలో సహాయపడుతుంది.