అందమైన కళ్లు కలిగిన 5 జంతువులు ఇవే..

ప్రకృతిలో కొన్ని అద్భుతమైన జీవులు ఉన్నాయి. ఇవి చూసేందుకు చాలా అందంగా, అమాయకంగా కనిపిస్తాయి.

వాటి అమాయకపు మొహం చూస్తుంటే వాటితో స్నేహం చేయాలని అనిపించవచ్చు.. కానీ వాటితో జాగ్రత్తగా ఉండాల్సిందే.

ఎందుకంటే.. ఇవి చాలా అందంగా కనిపించినా వాస్తవానికి వాటి హృదయాలు అంతే క్రూరంగా ఉంటాయి.

అయితే, అద్భుతమైన కళ్లు కలిగిన ఐదు రకాల జంతువుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

మంచు చిరుతలు అద్భుతమైన నీలం లేదా లేత ఆకుపచ్చ కళ్లు కలిగి ఉండి ఎంతో అందంగా ఉంటాయి.

తెలివైన సముద్ర క్షీరదాలైన డాల్ఫిన్లు ఉల్లాసభరిత, సామాజిక స్వభావాన్ని ప్రతిబింబించే పెద్ద కళ్లను కలిగి ఉంటాయి.

జింకలు పెద్ద, నల్లని కళ్లను కలిగి ఉండి ఎంతో అమాయకంగా కనిపిస్తుంటాయి.

టార్సియర్.. దాని చిన్న శరీర పరిమాణానికి భిన్నంగా ఆశ్చర్యకరంగా, పెద్దగా ఉండే కళ్లను కలిగి ఉంటుంది.

రెడ్ పాండా పెద్ద, గుండ్రని కళ్లతో దాని అందమైన రూపంతో అందరినీ ఆకర్షించేలా ఉంటుంది.