కొన్ని జంతువులు నీళ్లు తాగకుండా జీవించగలవు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

కంగారూ ఎలుకలు నీళ్లు తాగకుండానే బతకగలవు. అవి వాటి శరీరం ద్వారా నీటి అవసరాలను తీర్చుకుంటాయి. 

కోలా ఎలుగుబంట్లు కూడా నీరు లేకుండా బతకగలవు. అవి తమ ఆహారం ద్వారానే నీటి కొరతను తీర్చుకుంటాయి.

సహారా ఎడారిలో కనిపించే ఫెన్నెక్ నక్క కూడా నీళ్లు లేకుండా ఉండగలదు. ఇవి కూడా తమ ఆహారం ద్వారా నీటిని సేకరించుకుంటాయి.

ఒంటెలు కూడా నీరు లేకుండా చాలా రోజులు జీవించగలవు. ఇవి నీటిని తమ శరీరంలోని ఓ భాగంలో నిల్వ చేసుకుంటాయి.  

ఆస్ట్రేలియాలో కనిపించే థోర్నీ డెవిల్ బల్లి నీరు లేకుండా ఉండగలదు. ఇది కూడా తన శరీర సాయంతో నీటి కొరతను తీర్చుకుంటుంది.  

నార్త్, సెంట్రల్ అమెరికాలో కనిపించే రోడ్‌రన్నర్ పక్షులకు నీరు అవసరం లేదు. ఇవి కూడా ఆహారం నుంచే నీటిని సేకరించుకుంటాయి.