గుండె జబ్బు వచ్చే ముందు చర్మంపై కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
పాదాలలో వాపు కనిపిస్తోందంటే.. మీ గుండె రక్తాన్ని సమర్థవంతంగా పంపింగ్ చేయలేకపోతోందని అర్థం.
చర్మంపై పసుపు, నారింజ రంగు గడ్డలు కనిపిస్తుంటే.. చెడు కొలెస్ట్రాల్ పెరుగుతోందని అర్థం.
చేయి, కాలి వేళ్లలో విపరీతమైన నొప్పితో కూడిన గడ్డలు ఉంటే.. గుండె కవాటాల్లో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉందని అర్థం.
గోళ్ల కింద ఎరుపు, లేదా ఊదా రంగు రేఖలు ఉంటే.. రక్తనాళాలు కుచించుకుపోతున్నాయని అర్థం.
చర్మంపై నీలం లేదా ఊదా రంగు మచ్చలు కనిపిస్తుంటే.. గుండె ఆక్సిజన్ అధికంగా ఉన్న రక్తాన్ని పంప్ చేయలేకపోతోందని అర్థం. ఆక్సిజన్ స్థాయి తగ్గడం వల్ల గుండె పోటు వచ్చే ప్రమాదం ఉంటుంది.
ఇలాంటి లక్షణాలు మీలో ఉంటే.. వెంటనే వైద్యుడిని సంప్రదించి పరీక్షలు చేయించుకోండి.