ప్రపంచంలో ఒక్క ట్రాఫిక్ సిగ్నల్ కూడా లేని ఏకైక దేశం భూటాన్, ముఖ్యంగా ఆ దేశ రాజధాని థింపులో ట్రాఫిక్ సిగ్నల్స్ ఉపయోగించని నగరంగా ప్రసిద్ధి చెందింది.
ఆటోమేటెడ్ సిగ్నల్స్‌కు బదులుగా, ట్రాఫిక్ పోలీసు అధికారులు చేతి సంజ్ఞలు, శరీర కదలికలను ఉపయోగించి రద్దీగా ఉండే కూడళ్ల వద్ద వాహనాలను మాన్యువల్‌గా నిర్దేశిస్తారు.
2000 సంవత్సరం ప్రారంభంలో థింఫులో మొదటి ట్రాఫిక్ సిగ్నల్‌ను ఏర్పాటు చేశారు. కానీ ప్రజల నిరసన కారణంగా కొన్ని రోజుల్లోనే దానిని తొలగించారు.
స్థానికులు ట్రాఫిక్ సిగ్నల్‌ను వ్యక్తిత్వం లేనిదిగా భావించారు. మర్యాదపూర్వకమైన, చక్కగా దుస్తులు ధరించిన ట్రాఫిక్ పోలీసు అధికారుల ఉనికిని ఇష్టపడ్డారు.
ఈ వ్యవస్థ ఆటోమేషన్ కంటే భూటాన్ మానవ సంబంధాలు, మర్యాద, సంప్రదాయం అనే విలువలకు అనుగుణంగా ఉంటుంది.
దేశంలోని తక్కువ జనాభా, తక్కువ సంఖ్యలో వాహనాలు ఉన్నందున మాన్యువల్ ట్రాఫిక్ నియంత్రణను సమర్థవంతంగా, ఆచరణాత్మకంగా కొనసాగుతోంది.
సిగ్నల్స్ లేకపోయినా, క్రమశిక్షణతో కూడిన డ్రైవింగ్, ప్రభావవంతమైన మాన్యువల్ నియంత్రణ కారణంగా థింపులో చాలా అరుదుగా ట్రాఫిక్ రద్దీ ఉంటుంది.
సందర్శకులు ఈ వ్యవస్థను ప్రత్యేకంగా భావిస్తారు. చాలామంది ట్రాఫిక్ అధికారులను చూడటానికి, వారితో ఫోటో దిగడానికి ఇంట్రస్ట్ చూపుతారు.
ఈ విధానం వేగవంతమైన ఆధునీకరణ కంటే సరళమైన, స్థిరమైన అభివృద్ధికి మార్గనిర్దేశనం చేస్తోంది.