స్మార్ట్ ఫోన్‌లోని ఫ్లైట్ మోడ్‌తో
ఇన్ని లాభాలు ఉంటాయా..
స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ తమ ఫోన్‌లో ఫ్లైట్ మోడ్ ఆప్షన్‌ను చూసే ఉంటారు.
కొన్ని ఫోన్‌లలో ఇది ఎయిరోప్లేన్ మోడ్ అనే పేరుతో కూడా కనిపిస్తుంది.
వీటి పేరుకు తగ్గట్టే విమాన ప్రయాణాల సందర్భంగా జనాలు ఈ మోడ్‌ను ఆన్ చేస్తారు.
ఈ ఆప్షన్ ఆన్ చేయగానే ఫోన్‌లోని వైర్‌లెస్ నెట్‌వర్క్‌లు అన్నీ నిలిచిపోతాయి.
అయితే, విమానాల్లోనే కాకుండా ఫ్లైట్ మోడ్‌తో అనేక ఇతర ఉపయోగాలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
నెట్‌వర్క్ కవరేజీ లేని చోట స్మార్ట్ ఫోన్ నిరంతరంగా సిగ్నల్ కోసం వెతుకుతూనే ఉంటుంది.
దీని వల్ల ఫోన్ బ్యాటరీ త్వరగా అయిపోతుంది. ఇలాంటప్పుడు స్మార్ట్ ఫోన్‌లో ఫ్లైట్ మోడ్ ఆన్ చేసుకుంటే బ్యాటరీ చార్జింగ్ త్వరగా అయిపోదు.
ఫోన్ త్వరగా చార్జ్ చేసుకోవాలంటే ఫ్లైట్ మోడ్ ఆన్ చేసి చార్చ్ చేయాలని కూడా నిపుణులు చెబుతున్నారు.
అప్పుడు చార్జింగ్ వేగం సగటున 20 నుంచి 25
శాతం మేర పెరుగుతుందట.
ఫ్లైట్ మోడ్ ఆన్ చేసినప్పటికీ కూడా వైఫై లేదా బ్లూటూత్ కనెక్టివిటీని ఆన్ చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
Related Web Stories
ల్యాప్‌టాప్ బ్యాటరీ చార్జింగ్ త్వరగా అయిపోతోందా..
ఈ దీపావళికి మీ ఆత్మీయులకు ప్రత్యేక బహుమతి ఇవ్వాలనుకుంటున్నారా..
అనుబంధాన్ని పెంపొందించే 2-2-2 రూల్
సోయా బీన్స్ తినండి.. ఈ వ్యాధుల నుంచి కాపాడుకోండి..