ల్యాప్‌టాప్ బ్యాటరీ చార్జింగ్  త్వరగా అయిపోతోందా..

ల్యాప్‌టాప్ బ్యాటరీ చార్జింగ్ త్వరగా అయిపోవడం అనేది చాలా మంది ఎదుర్కొనే సమస్య.

ఈ పరిస్థితికి ల్యాప్‌టాప్‌లోని పవర్ సెట్టింగ్స్ కూడా ఒక కారణమని నిపుణులు చెబుతున్నారు.

 సిస్టమ్స్‌లో సెట్టింగ్స్‌ను జాగ్రత్తగా అవసరాలకు తగినట్టు మార్చుకుంటే బ్యాటరీ చార్జింగ్ చాలా సేపు నిలిచి ఉంటుందని చెబుతున్నారు.

 వీలైనంత వరకూ ల్యాప్‌టాప్‌ను బ్యాటరీ లేదా ఎనర్జీ సేవర్ మోడ్‌లో వాడుకోవాలి. దీని వల్ల బ్యాక్‌గ్రౌండ్ యాప్ యాక్టివిటీ, హార్డ్‌వేర్ వాడకం తగ్గుతుంది.

 స్క్రీన్ బ్రైట్‌నెస్ తగ్గించడం, స్లీప్ టైమర్స్‌ను మన వాడకాన్ని బట్టి మార్చుకుంటే బ్యాటరీ చార్జింగ్ ఎక్కువ సేపు నిలిచి ఉంటుంది.

 బ్లూటూత్, వైఫైలను అవసరం లేని సందర్భాల్లో ఆఫ్ చేసి ఉంచితే బ్యాటరీ చార్జింగ్‌ను పొదుపుగా వాడుకోవచ్చు.

డ్రైవర్స్, ఆపరేటింగ్ సిస్టమ్‌ను క్రమం తప్పకుండా అప్‌డేట్ చేసుకుంటూ ఉంటే చార్జింగ్‌ను మరింత పొదుపుగా వాడుకోవచ్చు.