ఈ దీపావళికి మీ ఆత్మీయులకు  ప్రత్యేక బహుమతి  ఇవ్వాలనుకుంటున్నారా..

దీపావళి వచ్చేసింది. పండుగ రోజు ఇష్టమైన వారికి బహుమతి ఇచ్చి సర్ ప్రైజ్ చేస్తే కలిగే అనుభూతి చెప్పలేనిది.

 బహుమతి అనగానే చీరలు, గిఫ్టులు, ఎలక్ట్రానిక్ గ్యాడెట్లు మన మైండ్లోకి వస్తాయి. 

 అయితే.. ఆర్థిక భరోసానిచ్చే గిఫ్టులు కూడా ఉంటాయని మీకు తెలుసా.

ఇవి అత్యవసర సమయాల్లో ఆత్మీయులకు అండగా నిలుస్తాయి.

వాటిని గిఫ్టుగా ఇస్తే జీవితాంతం గుర్తు పెట్టుకుంటారు.

బంగారు ఇటీఎఫ్‌లు (ఎక్స్‌ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్‌లు) దీపావళికి అద్భుతమైన కానుక అని చెప్పుకోవచ్చు.

ఫిక్స్‌డ్ డిపాజిట్లు లేదా ఎఫ్‌డీలు సురక్షితమైన రాబడిని అందిస్తాయి. కాబట్టి ఎఫ్‏డీలు అద్భుతమైన బహుమతి అని చెప్పుకోవచ్చు.

బీమా పాలసీ అత్యుత్తమ బహుమతుల్లో ఒకటి. ప్రియమైన వారి కోసం ఆరోగ్య బీమా ప్రీమియం కొనుగోలు చేయడం మంచిది.