తియ్యటి కర్భూజను ఈ సులభమైన ట్రిక్స్ తో ఈజీగా కనిపెట్టవచ్చు..

కొన్ని కర్బూజ పండ్లు తియ్యగా, రుచికరంగా ఉంటే మరికొన్ని చప్పగా ఉంటాయి.

సరైన కర్బూజ పండ్లను ఎలా గుర్తించాలి? అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం..

కర్బూజ పండు శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచడమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది.

కర్బూజ పండును కొనేటప్పుడు దాని అడుగు భాగాన్ని తనిఖీ చేయండి.

సహజంగా పండిన మస్క్ మెలోన్ ముదురు రంగు బేస్ కలిగి ఉంటుంది. బేస్ లేత రంగులో ఉంటే కర్బూజ పూర్తిగా పండలేదని, తగినంత తీపిగా ఉండదని సూచిస్తుంది.

కర్బూజను కొనేటప్పుడు దాని బరువును తనిఖీ చేయండి. పండు తేలికగా ఉంటే అది పూర్తిగా పండలేదని అర్థం.

 ఒకవేళ మందంగా ఉంటే, దానిలో ఎక్కువ గింజలు ఉన్నాయని, తియ్యగా ఉండదని అర్థం