డ్రై ఫ్రూట్‌ హల్వా..  ఇలా చేస్తే రుచిగా ఉంటుంది..

ముందుగా ఖర్జూర, అంజీర్‌, పిస్తా, జీడిపప్పు, బాదం, 

వాల్‌నట్స్‌ చిన్న చిన్న ముక్కలుగా కట్‌ చేసుకోవాలి.

తరువాత వాటిన్నింటినీ తీసుకుని మిక్సీలో వేసి.

ఒక టేబుల్‌స్పూన్‌ పాలు, ఒక టేబుల్‌స్పూన్‌ నెయ్యి వేసి మెత్తటి పేస్టులా పట్టుకోవాలి. 

స్టవ్‌పై పాన్‌ పెట్టి మిగిలిన నెయ్యి వేసి మిక్సీలో పట్టుకున్నపేస్టును వేసి వేయించాలి. 

నాలుగైదు నిమిషాలు వేయించిన తరువాత స్టవ్‌పై నుంచి దింపుకొని సర్వ్‌ చేసుకోవాలి.