చాలా మందికి రాత్రి పూట
పడుకున్న వెంటనే నిద్రపట్టదు
శారీరక, మానసిక ఆరోగ్యానికి ఆహారం, శారీరక శ్రమ ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం
ఒక వ్యక్తి రోజుకు కనీసం 7 – 8 గంటలు నిద్రపోవాలని నిపుణులు సలహా ఇస్తున్నారు.
నిద్రపోయేటప్పుడు సాక్స్ ధరించడం వల్ల బాగా నిద్రపడుతుంది.
మీ పాదాలకు వెచ్చని అనుభూతిని అందించడమే కాకుండా మెదడుకు నిద్ర సంకేతంగా పనిచేస్తుంది.
ఎక్కువ వెలుతురు ఉంటే, పడుకున్న వెంటనే నిద్రపట్టదు. లైట్లు ఆఫ్ చేసి గదిలోకి వెలుతురు పడకుండా చూసుకోవాలి.
శరీరంపై ఒత్తిడి, నొప్పి కలిగించని మృదువైన మంచం, దిండును ఉపయోగించాలి. ఇది ఖచ్చితంగా మంచి నిద్రకు సహాయపడుతుంది.
శబ్దాలు వింటే వెంటనే నిద్రపట్టదు. కాబట్టి మీ బెడ్ రూమ్ ని నిశ్శబ్దంగా ఉంచడానికి ప్రయత్నించాలి.
పడుకునే ముందు మొబైల్ చూసే బదులు ఏదైనా పుస్తకం చదవడం అలవాటు చేసుకుంటే. ఒత్తిడిని తగ్గించి మనసును ప్రశాంతంగా ఉంచడానికి ఇది ఒక గొప్ప మార్గం.
Related Web Stories
స్వీట్లు తిన్న తర్వాత నీళ్లు తాగుతున్నారా?
జుట్టు రాలడానికి కారణమయ్యే పోషకాలు ఇవే!
కాకరకాయ పొడి.. ఒక్కసారి ఇలాచేస్తే చేదులేకుండా కమ్మగా రోజు తినేయచ్చు..
రోజూ ఫ్లూట్ వాయించడం వల్ల కలిగే ప్రయోజనాలివే..