కాకరకాయ పొడి.. ఒక్కసారి ఇలాచేస్తే చేదులేకుండా కమ్మగా రోజు తినేయచ్చు..

కావలసిన పదార్థాలు: మినప్పప్పు- స్పూను, శెనగలు- స్పూను, ఎండు మిర్చి- అయిదు, వెల్లుల్లి రెబ్బలు- అయిదు, 

ధనియాలు- అర స్పూను, చింతపండు- కాస్త, కాకరకాయలు- నాలుగు, ఉప్పు, నూనె- తగినంత.

తయారుచేసే విధానం: ముందుగా కాకరకాయల్ని గుండ్రంగా కట్‌ చేసుకోవాలి.

పాన్‌లో కాస్త నూనె వేసి ఈ ముక్కల్ని వేయించి పెట్టుకోవాలి. 

మినప్పప్పు, శనగలు, ఎండు మిర్చి, వెల్లుల్లి, ధనియాలు, చింత పండును వేయించుకుని చల్లారాక మిక్సీలో వేసి పొడిగా చేసుకోవాలి.

దీంట్లో వేయించిన కాకరకాయ ముక్కలు, ఉప్పు కూడా కలిపి మిక్సీ తిప్పితే కాకరకాయ పొడి సిద్ధం.