జుట్టు రాలడానికి కారణమయ్యే  పోషకాలు ఇవే!

జుట్టు రాలడానికి లేదా జుట్టు పెరుగుదల పూర్తిగా ఆగిపోవడానికి ఎన్నో కారణాలున్నాయి.  కానీ,

ప్రధాన కారణం మాత్రం శరీరంలో పోషకాహారం లోపించడమే. వెంట్రుకల పెరుగుదలకు సరైన పోషకారం అవసరం.

మహిళల్లో జుట్టు రాలడానికి ఐరన్ లోపం ఒక ప్రధాన కారణం.దీనివల్ల జుట్టు కుదుళ్లు బలహీనపడి జుట్టు పెరగడానికి బదులుగా రాలిపోతుంది.

విటమిన్ డి ఎముకలకు మాత్రమే కాకుండా జుట్టు కుదుళ్ల ఆరోగ్యానికి కూడా ముఖ్యమైనది.

ఇది తక్కువైతే జుట్టు విపరీతంగా రాలిపోతుంది. పెరుగుదల సైతం నెమ్మదిస్తుంది.

బయోటిన్‌ను తరచుగా 'హెయిర్ విటమిన్' అని పిలుస్తారు. ఈ విటమిన్ జుట్టు, చర్మం, గోళ్లకు చాలా ముఖ్యమైనది.

ఈ విటమిన్ లోపిస్తే జుట్టు పల్చబడటం ప్రారంభమవుతుంది, వేగంగా రాలిపోతుంది. పెరుగుదల పూర్తిగా ఆగిపోతుంది.

విటమిన్ E కూడా ఒక ముఖ్యమైన యాంటీఆక్సిడెంట్. ఇది ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడం ద్వారా తలకు రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది .

శరీరంలోని ప్రతి కణం పెరుగుదలకు విటమిన్ ఎ చాలా అవసరం. జుట్టు శరీరంలో వేగంగా పెరిగే కణాలలో ఒకటి.

విటమిన్ ఎ అధిక మోతాదు కూడా జుట్టు రాలడానికి కారణమవుతుందని గుర్తుంచుకోండి.