స్వీట్లు తిన్న తర్వాత నీళ్లు తాగుతున్నారా?
స్వీట్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి.. దాదాపు ప్రతి ఒక్కరూ తీపి రుచులు ఆస్వాదించేవారే.
స్వీట్స్ తిన్న తర్వాత, వెంటనే నీళ్ళు తాగుతారు. ఇది దాదాపు అందరికీ ఉండే అలవాటు.
కానీ ఇలా స్వీట్లు తిన్న తర్వాత నీళ్లు తాగితే ఒంట్లో ఏమి జరుగుతుందో తెలుసా? దీని గురించి నిపుణులు ఏమి చెబుతున్నారో.. ఇక్కడ తెలుసుకుందాం..
ఒక్క మాటలో చెప్పాలంటే స్వీట్లు తిన్న తర్వాత వెంటనే నీళ్లు తాగడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు.
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. స్వీట్లు తినడం వల్ల శరీరంలో చక్కెర పరిమాణం త్వరగా పెరుగుతుంది. దీనిని షుగర్ స్పైక్ అంటారు
స్వీట్లు తిన్న తర్వాత నీరు త్రాగడం వల్ల ఈ చక్కెర స్పైక్ సమస్య మరింత అధికంగా ఉంటుంది.
తీపి పదార్థాలు సరిగ్గా జీర్ణం కావడానికి వాటిని తినడానికి ముందు లేదా తర్వాత నీరు త్రాగడం చాలా ముఖ్యం.
స్వీట్లు తిన్నప్పుడల్లా దంత బ్యాక్టీరియా మరింత చురుగ్గా మారుతుంది. అందుకే స్వీట్లు తిన్న కాపేపటి తర్వాత నీళ్లు తాగడం వల్ల ఆ బ్యాక్టీరియా తొలగిపోతుంది.
కేవలం స్వీట్లు మాత్రమే కాదు, ఏదైనా ఆహారం తిన్న ఆరగంట, గంట తర్వాత క్రమం తప్పకుండా నీరు త్రాగడం చాలా ముఖ్యం.
Related Web Stories
జుట్టు రాలడానికి కారణమయ్యే పోషకాలు ఇవే!
కాకరకాయ పొడి.. ఒక్కసారి ఇలాచేస్తే చేదులేకుండా కమ్మగా రోజు తినేయచ్చు..
రోజూ ఫ్లూట్ వాయించడం వల్ల కలిగే ప్రయోజనాలివే..
వినాయక చవితి స్పెషల్.. ఈ లడ్డులు ట్రై చేయండి