బియ్యం నీరు నిజంగా అందాన్ని పెంచుతుందా..?
మీకు కొరియన్ గ్లాస్ స్కిన్ కావాలా? మీ ముఖానికి బియ్యం నీటిని అప్లై చేయండి అని అంటుంటారు.
చాలా కొరియన్ బ్యూటీ ప్రోడక్ట్స్‌లో బియ్యం నీటిని ఉపయోగిస్తారని చెబుతుంటారు.
నిజానికి బియ్యం పిండి చర్మపు రంగును మెరుగుపరచడంలో, మృదువుగా చేయడంలో సహాయపడుతుంది.
ఇది చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. తేమను నిలుపుతుంది. ఎండ, కాలుష్యం నుంచి కలిగే నష్టాన్ని తగ్గిస్తుంది.
దీంతోపాటు బియ్యం నీటిలో ఉండే కిణ్వ ప్రక్రియ ద్వారా ఉత్పత్తి అయ్యే అమైనో ఆమ్లాలు, ఎంజైమ్‌లు చర్మాన్ని మరింత ప్రకాశవంతంగా, ఆరోగ్యంగా ఉంచుతాయి.
ఇది చాలా ప్రయోజనాలను కలిగి ఉన్నప్పటికీ, బియ్యం నీటితో మాత్రమే అందమైన చర్మాన్ని పొందడం పూర్తిగా సాధ్యం కాదు.
కొరియన్ లాంటి అందమైన చర్మం కోసం డీప్ మాయిశ్చరైజింగ్, సరైన ఎక్స్‌ఫోలియేషన్, సన్ స్క్రీన్, ఆరోగ్యకరమైన జీవనశైలి కూడా చాలా అవసరం.
అయితే, చర్మ సంరక్షణ దినచర్యలో బియ్యం నీటిని సహజ బూస్టర్‌గా ఉపయోగించవచ్చు.
Related Web Stories
మద్యం.. లోపలికి వెళ్లాక ఏం చేస్తుంది..?
జీవితంలో ఎన్నడూ చేయకూడని తప్పులు ఏవో తెలుసా?
సాలెపురుగుల సమస్యతో ఇబ్బంది పడుతున్నారా..?
బియ్యం కడగకుండా వండితే జరిగేది ఇదే...