సాలెపురుగుల సమస్యతో ఇబ్బంది పడుతున్నారా..? 

సాలీడు వల సమస్య నుండి బయటపడేందుకు అద్బుతమైన చిట్కాలు ఇక్కడ చూద్దాం...

ప్రతి ఇంట్లో తరుచూ చూసే సమస్యల్లో సాలె పురుగులు కూడా ఒకటి. ఎంత దులిపినా, క్లీన్ చేసినా పురుగులు కనిపిస్తూ ఉంటాయి.

ఇందుకోసం ఒక బాటిల్ నీటిలో నాలుగు నుంచి ఐదు చుక్కల పుదీనా ఆయిల్ వేసి స్ప్రే చేయాలి. ఇలా చేస్తే సాలెపురుగులు దరి చేరవు.

లవంగాలు, కర్పూరం కూడా మీ ఇంటి నుండి సాలెపురుగు వలలను తొలగించడంలో ప్రభావవంతంగా ఉంటాయి.

  అర కప్పు తెల్ల వెనిగర్‌ను అర కప్పు నీటితో కలిపి, సాలెపురుగులు ఉన్న ప్రదేశంలో స్ప్రే చేయండి. ఇది సాలెపురుగులు అక్కడ మళ్ళీ వలలు నిర్మించకుండా నిరోధిస్తుంది.

 నిమ్మరసాన్ని నీటితో కలిపి మీ ఇంటి మూలల్లో పిచికారీ చేయండి.

మిరియాల పొడిని నీళ్లలో కలిపి స్ప్రే చేయటం వల్ల కూడా చక్కటి ఫలితం ఉంటుంది.