ప్రస్తుతం మార్కెట్లో బియ్యం అనేక రకాలుగా లభిస్తున్నాయి. చాలా మంది బియ్యం తినడానికి ఇష్టపడతారు
బియ్యం కడగకపోతే కుకింగ్ టైంలో అతుక్కుపోవడం లేదా మరీ మెత్తగా ఉడికిపోయే ప్రమాదం ఉంటుంది. దాని వల్ల బియ్యం ఆకృతి, టెక్స్‌చర్ మీకు నచ్చకపోవచ్చు.
బియ్యాన్ని శుభ్రమైన నీటితో సరిగ్గా కడగకపోతే, కడుపు నొప్పి సమస్యలు రావచ్చు.
ఎందుకంటే, దానిలో ఉండే దుమ్ము, ధూళి శరీరానికి హాని కలిగించి అనారోగ్యానికి గురయ్యేలా చేస్తాయి. పదే పదే బియ్యం కడుగకుండా వండుకుని తింటే అనేక వ్యాధులు వస్తాయి.
కాబట్టి బియ్యం వండే ముందు కనీసం రెండు నుంచి మూడుసార్లు శుభ్రమైన నీటితో బాగా కడగాలి. ఇలా చేస్తే బియ్యం టేస్టీగా ఉండటమే కాకుండా హెల్త్‌కి కూడా మంచిది.
బియ్యాన్ని కడిగిన తర్వాత కనీసం 10 నిమిషాలపాటు నీటిలో నానబెట్టడం మంచిది. ఇలా చేస్తే బియ్యం త్వరగా.. ఈవెన్‌గా ఉడుకుతుంది. పైగా త్వరగా పాడవకుండా కూడా ఉంటుంది.
ఇలా చేస్తే బియ్యం టేస్టీగా, హెల్దీగా, జీర్ణం అవ్వడానికి ఈజీగా తయారవుతుంది. ఈ టిప్స్ ఫాలో అయ్యి హెల్దీగా ఉండండి.